![]() |
![]() |
.webp)
ప్రతీ ఒక్కరి జీవితంలో కొన్ని మరచిపోలేని జ్ఞాపకాలుంటాయి. అవి మాటలుగా, పాటలుగా మనకి మళ్లీ మళ్లీ వినబడితే వినాలని అనిపిస్తుంది. కానీ ఇద్దరు ప్రేమించుకుంటే వారిని ఈ సమాజం ప్రస్తుతం ఒకేలా చూస్తుందా.. పోనీ ఫ్రెండ్స్ గా ఉన్న ఆడ, మగ ఇద్దరిని వక్రీకరించకుండా చూస్తుందా అంటే అలా చూడదు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో హౌస్ మేట్స్ గా ఉన్న ప్రిన్స్ యావర్, నయని పావని ఇద్దరు స్నేహితులుగా మారారు.
నయని పావని, ప్రిన్స్ యావర్ లని బయట చూసే కొన్ని వీడియో సాంగ్ లలో ఫోటోషూట్ లలో వారిని చూసి తప్పుగా మాట్లాడుతున్నారు. దాని గురించి యావర్ నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. యావర్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ కి క్వశ్చనింగ్ స్టార్ట్ చేశాడు. ఇందులో ఒక్కొక్కరు ఒక్కో క్వశ్చన్ అడుగగా వాటికి రిప్లై ఇచ్చాడు. నయని పావని మీరిద్దరు కలిసి రిలేషన్ షిప్ లో ఉన్నారా అని ఒకరు అడుగగా.. లేదు. మేం జస్ట్ ఫ్రెండ్స్ .. తను పాడిన పాట ప్రమోషన్స్ లో భాగంగా మేమిద్దరం అలా ఓ వీడియో షూట్ చేశామంతే కానీ మా మధ్యలో ఏమీ లేదంటూ యావర్ అన్నాడు. ఇంకా కొంతమంది తమకి యావర్ అంటే ఇష్టమని చెప్పగా థాంక్స్ చెప్పాడు. తాజాగా మొదలైన బిబి ఉత్సవంలో యావర్, ప్రశాంత్, శివాజీ కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు ఎంత వైరల్ గా మారాయో అందరికి తెలిసిందే. హౌస్ లో యావర్ తో రతిక లవ్ ట్రాక్ కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది.
బిగ్ బాస్ సీజన్ 7లో ప్రిన్స్ యావర్-నయని పావని జోడీ భలే క్యూట్‌గా ఉండేది. పావని హౌస్‌లో ఉన్నది ఒక్కవారమే అయితే.. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ముచ్చట్లు బాగానే జరిగాయి. ఇక ఎలిమినేషన్ తరువాత కూడా యావర్‌కి గట్టిగానే సపోర్ట్ చేసింది నయని. ఇప్పుడు వీళ్లిద్దరు చేసిన వీడియో సాంగ్ చూసిన కొందరు తమని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్తూ మేము ఫ్రెండ్స్ గానే ఉన్నామని యావర్ చెప్పుకొచ్చాడు. దయచేసి మమ్మల్ని అలా చూడకండి అంటు యావర్ ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్లతో పంచుకున్నాడు.
![]() |
![]() |